యష్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం… టాక్సిక్. ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోంది అనే వార్త చాలా కాలం హల్చల్ చేసింది. ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సిన టైంలో ఇప్పుడు కొత్త వార్తలు వస్తున్నాయి.
కరీనా కపూర్ ఈ సినిమా నుంచి తప్పుకొంది అనేది బాలీవుడ్ వెబ్ సైట్స్ రాస్తున్నాయి. మరోవైపు, కరీనా తప్పుకోగానే ఈ సినిమా టీం నయనతారని సంప్రదించినట్లు సమాచారం. అంటే కరీనా చెయ్యాల్సిన సోదరి పాత్రని నయనతార పోషిస్తుంది అన్నమాట.
యష్ సరసన హీరోయిన్ గా నటించాల్సిన నయనతార అతనికి సోదరిగా నటించేందుకు ఒప్పుకుంటోంది అంటే సాహసమే అని చెప్పాలి. ఒక పెద్ద హీరోకి సోదరిగా నటిస్తే ఆ తర్వాత ఇతర పెద్ద హీరోల సరసన హీరోయిన్ రోల్స్ రావడం కష్టం అవుతుంది. ఐతే, ఈ సినిమాలో ఉన్న పాత్ర నచ్చి ఆమె ఒప్పుకుంటోంది అనే మాట వినిపిస్తోంది.
“టాక్సిక్” అనే ఈ మూవీని గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ ఈ సినిమాకి నిర్మాత కూడా. “కేజీఎఫ్” సినిమాల తర్వాత చేస్తున్న మూవీ కావడంతో యష్ చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More