ముంబయిలో ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న ఇంటిని నటి కమ్ ఎంపీ కంగనా రనౌత్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, తమ లిస్టింగ్ లో ఈ ప్రాపర్టీని కొన్ని రోజుల కిందట సేల్ కు పెట్టింది. ఇప్పుడీ ప్రాపర్టీ అమ్మకం పూర్తయింది.
ముంబయిలోని పాలీ హిల్ బంగ్లాను ఆమె 32 కోట్ల రూపాయలకు విక్రయించింది. ఈ ప్రాపర్టీని ఆమె 2017లో 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 3075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ ఇంట్లో, 565 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది.
ఈ ప్రాపర్టీ అంటే కంగనాకు చాలా ఇష్టం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, చాలా ఏళ్ల కిందటే ఆమె ఇంటీరియర్ చేయించుకుంది. అంతేకాదు, ముందు భాగాన్ని తన ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ గా కూడా మార్చుకుంది.
అయితే ఎంపీగా మారిన తర్వాత ఆ ప్రాపర్టీపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఇదే బంగ్లా కేంద్రంగా ముంబయి మహానగర పాలక సంస్థతో, కంగనా రనౌత్ కు గొడవ జరిగింది. కార్పొరేషన్ వాళ్లు సొంత భాగాన్ని కూలగొట్టారు కూడా. భవిష్యత్తులో అలాంటి వివాదాలు ఉండకుండా ప్రాపర్టీని ఆమె అమ్మేసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More