ప్రభాస్ సినిమాల వ్యాపారం మాములుగా వుండదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ భారీగా జరుగుతుంది. తాజాగా “కల్కి 2898 AD” సినిమాకి కూడా రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకి 160 నుంచి 180 కోట్ల మధ్య బిజినెస్ జరిగేలా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం ఇది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డిస్టిబ్యూటర్లు నిర్మాతకు ముందే కట్టే అమౌంట్.
ఇది ఒక విధంగా చెప్పాలంటే భారీ మొత్తం. ఇటీవల “ఆర్ ఆర్ ఆర్” సినిమా మినహా మరో సినిమా అంత మొత్తం వసూళ్లు సాధించలేదు. ప్రభాస్ కి ఇటీవల హిట్ వచ్చింది అనిపించుకున్న “సలార్” కూడా 148 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.
Salaar – Theatrical Business Bidding
AP – Rs 110 Cr
Telangana – Rs 65 – 70 Cr
160 కోట్ల పైన బిజినెస్ చేస్తే ఆ సినిమా ఎంత లేదన్న 200 కోట్ల షేర్ అందుకోవాలి లాభాలు చూడాలంటే. అలా జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు చేసేందుకు అంగీకరించాలి. అది సాధ్యం కావాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చినా, లేదంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు కుదురుకొని టికెట్ రేట్ల పెంపు జీవో ఇవ్వాలి.
ఆ లెక్కన చూస్తే “కల్కి” జూన్ నెలాఖరులో కానీ జులైలో కానీ విడుదల అయ్యేలా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More