కొన్ని సినిమాలు అనుకోకుండా భలే సెట్ అవుతాయి. ఇది కూడా అలాంటిది ఉదంతమే. జూన్ 7 వీకెండ్ అరడజను సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో రెండు సినిమాలు మాత్రం ఒకే జానర్ లో వస్తున్నాయి. పైగా రెండూ ఫిమేల్ ఓరియంటెడ్ కథలే.
కెరీర్ లో తొలిసారి హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ చేసింది. అలా కాజల్ చేసిన ఆ సినిమా “సత్యభామ”. ఇందులో ఆమె పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. జూన్ 7న విడుదల కానుంది. ఇప్పటికే కాజల్ ఈ సినిమా కోసం తెగ ప్రచారం చేస్తోంది.
సరిగ్గా ‘సత్యభామ’ రిలీజైన రోజునే మరో ఖాకీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. దాని పేరు “రక్షణ”. గమ్మత్తుగా ఇది కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానే. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది.
ఇలా ఒకేసారి రెండు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు, ఒకే జానర్ లో థియేటర్లలోకి రావడం కాకతాళీయం. అయితే ఈ సినిమాలతో పాటు ఆ రోజున శర్వానంద్ ‘మనమే’ మూవీ వస్తోంది. అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More