జానీ లివర్… పరిచయం అక్కర్లేని కమెడియన్. రెండు దశాబ్దాలు బాలీవుడ్ ని ఏలిన హాస్య నటుడు ఆయన. పేరు తెచ్చుకున్నది, స్టార్డమ్ సంపాదించుకున్నది బాలీవుడ్ లోనే కానీ ఆయన అచ్చ తెలుగువాడు.
ఇప్పటికీ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ఆయన. ఇక ఆయన కూతురు జెమి లివర్ స్టాండప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. స్టాండప్ షోలతో ప్రపంచమంతా తిరుగుతారు. స్టాండప్ షోలతో తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్న జెమి లివర్ తెలుగులో కూడా అరంగేట్రం చేస్తున్నారు.
ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం… ‘ఆ ఒక్కటీ అడక్కు’.
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం… ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ఇందులో నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఐతే ఒక కీలకమైన పాత్రలో జెమిని తీసుకున్నారు మేకర్స్.
ఆమె తెలుగులో ధారాళంగా మాట్లాడలేదు కానీ బాగానే కమ్యూనికేట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More