“దేవర” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది జాన్వీ కపూర్. ఆమెకి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. శ్రీదేవి కూతురు కావడం ప్రధాన కారణం. ఇక ‘దేవర’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. తాజాగా థాయిలాండ్ లో ఒక పాట తీశారు. ఈ రోజు (జూన్ 20)తో ఆ పాట చిత్రీకరణ పూర్తి అయింది.
జాన్వికి ఎన్టీఆర్ తో మొత్తం మూడు పాటలు ఉంటాయి. ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా థాయిలాండ్ లో ఒకటి పూర్తి అయింది. మరో పాటని హైదరాబాద్ లో వేసిన సెట్ లో తీస్తారు. కుదిరితే మరో స్పెషల్ ప్రొమోషన్ పాట కూడా చిత్రీకరించొచ్చు. మొత్తమ్మీద ఒక నెల రోజుల వ్యవధిలో ఈ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.
సో, ఆ వెంటనే ఆమె రామ్ చరణ్ సినిమా (#RC16) షూటింగ్ మొదలు పెడుతుంది. రామ్ చరణ్ సరసన ఆమె నటించనుంది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీసే చిత్రంలో జాన్వీ మెయిన్ హీరోయిన్. ఆగస్టు చివర్లో కానీ, సెప్టెంబర్ మొదటివారంలో కానీ రామ్ చరణ్ తో జాన్వీ షూటింగ్ స్టార్ట్ చేస్తుంది.
ఈ రెండు సినిమాలు తెలుగులో ఆమెకి సాలిడ్ కెరీర్ సెట్ చేస్తాయి అనడంలో సందేహం లేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More