న్యూస్

ఇంద్ర మళ్లీ వస్తున్నాడు

Published by

దాదాపు రెండేళ్లుగా నడుస్తున్న రీ-రిలీజ్ కల్చర్ ఈ సీజన్ లో మరింత ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీస్, క్లాసిక్స్ అన్నీ ఒకేసారి క్యూ కడుతున్నాయి. మహేష్ బాబు మురారి, నాగార్జున మైల్ స్టోన్ మూవీ శివ ఇప్పటికే రీ-రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా చేరింది.

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఇంద్ర సినిమా. ఇప్పుడీ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఇంద్ర సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది.

మెగా ఫ్యాన్స్ కు “ఇంద్ర” సినిమా ఓ ఎమోషన్. దానికి ఓ చిన్న కారణం ఉంది. అప్పటికే ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య మంచి స్వింగ్ మీదున్నారు. ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే బాలయ్య మాత్రమే అంటూ ప్రచారం చేసుకునేవాళ్లు నందమూరి అభిమానులు.

అలాంటి టైమ్ లో వచ్చిన “ఇంద్ర” సినిమా మెగాభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాక్షన్ అయినా, యాక్షన్ అయినా చిరంజీవి తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

అటు చిరంజీవి కూడా “ఇంద్ర” హిట్ తో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 22 ఏళ్ల కిందట తెలుగులోనే కాదు, టోటల్ సౌత్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇంద్ర. అది మామూలు కిక్ కాదు. అందుకే ఆ సినిమా విజయోత్సవ సభలో చిరంజీవి స్వయంగా వీణ స్టెప్ వేసి తన ఫ్యాన్స్ ను ఆనందపరిచారు. 

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025