“పుష్ప 2” షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. “పుష్ప” మొదటి భాగం 2021 డిసెంబర్ లో విడుదలైంది. రెండో భాగం విడుదలకు మూడేళ్లు పట్టింది. దర్శకుడు సుకుమార్ తో అట్లుంటది మరి.
ఇక ఇప్పుడు దీనికి మూడో భాగం కూడా తీస్తామని ప్రకటించారు. ఐతే, వెంటనే మూడో భాగం తీయలేరు. అల్లు అర్జున్ ఈలోపు ఒకటో, రెండో ఇతర సినిమాలు చేసుకున్నాక మూడో భాగం తీసారట. రెండో భాగానికి మూడేళ్లు తీసుకున్న సుకుమార్ మూడో దానికి ఎన్నేళ్లు తీసుకుంటాడో.
“పుష్ప” కథని సింగిల్ సినిమాగానే మొదలుపెట్టారు. మధ్యలో బడ్జెట్ పెరుగుతోందని రెండు భాగాలుగా మలిచారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఈ సినిమా హిందీలో బాగా ఆడింది. తెలుగులో అంతంతమాత్రంగానే ఆడింది. కానీ ఇతర భాషల్లో హిట్ కావడంతో “పుష్ప” బ్రాండ్ కి క్రేజ్ పెరిగింది. దాంతో రెండో భాగం బాగా తీయాలని సుకుమార్ ఇంత టైం తీసుకున్నాడు.
“పుష్ప 2” కూడా అంచనాలు అందుకొని భారీ విజయం సాధిస్తే మూడో భాగం ఎంత లేట్ అయినా జనం వెయిట్ చేస్తారు. ఒకవేళ ఆడకపోతే మూడో భాగం అనే ఆలోచన ఉండదు. డిసెంబర్ 5 వరకు వెయిట్ చెయ్యాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More