బాడీ షేమింగ్.. చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న సమస్య ఇది. మేకప్ ఎక్కువైనా విమర్శిస్తారు, తక్కువైనా విమర్శిస్తారు. ఒంపుసొంపులపై ఎక్కడలేని కామెంట్స్ చేస్తారు. తాజాగా అలియా భట్ పై సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్ నడుస్తున్నాయి.
ఆమె నవ్వులో తేడా కనిపిస్తోందని, ముఖకవలికల్లో మార్పు వచ్చిందంటూ ఓ సెక్షన్ అలియా భట్ పై విమర్శలు మొదలుపెట్టింది. ఆమె రీసెంట్ గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని, అది కాస్తా వికటించిందంటూ కథనాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో దీనిపై చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై అలియా భట్ సీరియస్ అయింది. తనపై వస్తున్న వీడియోలపై ఆమె ఫైర్ అయింది. ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై ఎలా బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారంటూ ఆమె కొన్ని సోషల్ మీడియా పేజీలపై విరుచుకుపడింది.
విమర్శించే క్రమంలో కొంతమంది మరీ హద్దులు దాటేస్తున్నారని, బాడీ షేమింగ్ విమర్శలు చేసే వాళ్లలో మహిళలు కూడా ఉండడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది అలియా భట్. తాజాగా ఆమె నటించిన ‘జిగ్రా’ సినిమా ఫ్లాప్ అయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More