పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ కార్యకలాపాలతో తలమునకలై ఉన్నారు. ఆయన పూర్తి చెయ్యాల్సిన మూడు సినిమాల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన సినిమాలో నటించకపోవచ్చు అనేది ఒక మాట.
ఐతే, అదంతా అబద్దం అని అంటున్నారు ప్రముఖ నిర్మాత ఏ. ఎం. రత్నం. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన “హరి హర వీర మల్లు – పార్ట్ 1” నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80 శాతం పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ ఒక పాతిక రోజుల టైం ఇస్తే మిగతా భాగం పూర్తి చేస్తామని రత్నం చెప్తున్నారు.
ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థకు రత్నం ఇప్పటికే అమ్మేశారు. విడుదల విషయంలో ఓటిటి కంపెనీలు పక్కాగా ఉంటాయి. ఫలానా టైంలోపే సినిమాని థియేటర్లలో విడుదల చేసి, నెల తర్వాత స్ట్రీమింగ్ కి ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటాయి. “హరి హర వీరమల్లు” సినిమాని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేస్తామని అమెజాన్ సంస్థకు మాటిచ్చారు రత్నం. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు.
“అవును విడుదల కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ లోపే రిలీజ్ చేస్తాం. ఇంకా ఎక్కువ కాలం వాయిదా వెయ్యలేం,” అని ఆయన అంటున్నారు.
” హరి హర వీర మల్లు” దాదాపు మూడున్నర ఏళ్ల క్రితం మొదలు పెట్టారు. ఈ సినిమాకి మొదట దర్శకుడు క్రిష్. ఇప్పుడు అతను తప్పుకున్నాడు. దాంతో జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి చెయ్యనున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More