బిగ్ బాస్ సీజన్-8 ఇలా మొదలైందో లేదో అలా హాట్ టాపిక్ గా మారింది విష్ణు ప్రియ. “బిగ్ బాస్” హౌజ్ లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఆమె తన నోటి దురుసును బయటపెట్టడం మొదలుపెట్టింది. అలా హౌజ్ లో చాలామందికి దూరమైంది.
హౌజ్ లో అడుగుపెడుతూనే తనలో అందాలు ఎక్కువ అని చెప్పుకుంది విష్ణు ప్రియ. అది నిజమే కాబట్టి కంటెస్టెంట్లు పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది మహిళా కంటెస్టెంట్లు తనకి పొగరు అని మనసులో అనుకున్నప్పటికీ బయట పడలేదు.
ఎప్పుడైతే ఆమె మణికంఠపై నోరు పారేసుకుందో, ఆ క్షణం నుంచి ఆమె ఏకాకిగా మారడం మొదలైంది. తనలో ఫెమినిజం ఎక్కువ అని చెప్పుకున్న విష్ణుప్రియ, అదే టైమ్ లో మణికంఠతో మాట్లాడుతూ.. మీలో మగతనం తక్కువ ఆడంగితనం ఎక్కువ అనే అర్థం వచ్చేలా మాట్లాడింది.
అప్పట్నుంచి విష్ణుప్రియను టార్గెట్ చేశాడు మణికంఠ. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఆ టైమ్ రానే వచ్చింది. బిగ్ బాస్ తొలి రౌండ్ ఎలిమినేషన్స్ లో భాగంగా విష్ణుప్రియను నామినేట్ చేశాడు మణికంఠ.
అలా విష్ణుప్రియ మెడపై కత్తి వేలాడుతోంది.
ఎలిమినేషన్ రౌండ్ కు బేబక్క, విష్ణు ప్రియ, మణికంఠ, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాషా నామినేట్ అయ్యారు. వీళ్లలో ఎంతమంది హౌజ్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో బిగ్ బాస్ తేలుస్తాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More