సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దసరా సీజన్ లో టాలీవుడ్ లో దేవర, వేట్టయన్ సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు టికెట్ రేట్లు తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. తగ్గించిన టికెట్ రేట్లు రేపట్నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.
ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ చేయాలని ఉంది అని అంటున్నారు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్.
“జై భీమ్ తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ‘జై భీమ్’ ఓ సెక్షన్ ఆడియెన్స్‌కి రీచ్ అయింది. రజినీకాంత్ సినిమా ఐతే అందరికీ చేరుతుంది నా ఆలోచన. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయినా నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఇక ఇప్పుడు అందరూ సీక్వెల్ తీస్తారా అని అడుగుతున్నారు. కానీ ప్రీక్వెల్‌ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. హీరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎలా అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను.”
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More