సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది. సినిమాల బడ్జెట్ బాగా పెరిగిపోయింది. హీరోల రెమ్యూనరేషన్లు చుక్కలు తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పరిశ్రమ మనుగడ ఎలా? ఇండస్ట్రీ బతికిబట్టకట్టాలంటే ఏం చేయాలి? దీనికి 2 సింపుల్ సొల్యూషన్స్ చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు.
“పెద్ద హీరోల సినిమాల బడ్జెట్స్ పెరిగిపోయాయి. ఒక్కో సినిమాకు 400-500 కోట్లు అయిపోతోంది. దీంతో ఒక సినిమాపైనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. సినిమా ఆడకపోతే చాలా డ్యామేజీ అయిపోతుంది. ఇప్పుడున్న టాప్ స్టార్స్ అంతా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఇక్కడ కరెక్షన్ జరగాలి. ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. బన్నీ ఇకపై 2 సినిమాలు చేస్తున్నాడు. ఇలా అంతా ఏడాదికి రెండేసి చేయాలి. స్టార్ హీరోల సినిమాలు 2, వాటి మధ్యలో ఓ మిడ్ రేంజ్ సినిమా.. ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా సక్సెస్ శాతం పెరుగుతుంది. ఇదొక్కటే సొల్యూషన్.”
తన దశాబ్దాల అనుభవంతో దిల్ రాజు చెప్పిన మార్గమిది. దీంతో పాటు ఆయన చెప్పిన మరో చిన్న సొల్యూషన్ కూడా ఉంది. హీరోలు నిర్మాణంలో భాగస్వాములు కావాలనేది దిల్ రాజు సూచన.
హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని ఈయన చెప్పడం లేదు. ఉన్న రెమ్యూనరేషన్ లో కొంత వైట్ లో తీసుకొని, మిగతాది ప్రొడక్షన్ లో పార్టనర్ షిప్ కింద తీసుకోమంటున్నారు. ఇలా చేస్తే నిర్మాతపై భారం తగ్గుతుందని ఇండస్ట్రీ బాగుంటుందని అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More