న్యూస్

మెగాస్టార్ తో బుల్లిరాజు

Published by

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు వెంకటేష్. ఆయన తర్వాత ఆ సినిమా అద్భుతంగా ఎవరికైనా కలిసొచ్చిందంటే అది బుల్లిరాజుకు మాత్రమే. అతడే భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఈ పేరు చెబితే చాలామంది ఈ పిల్లాడ్ని గుర్తుపట్టరు. అదే బుల్లిరాజు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు.

ఇప్పుడీ బుల్లిరాజు ఏకంగా చిరంజీవితో కలిసి నటించే అవకాశం అందుకున్నాడు. అనీల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో బుల్లి రాజు కూడా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ క్లిప్ లీక్ అయింది. అందులో చిరంజీవి పక్కన బుల్లిరాజు కూడా ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబోలో కొన్ని కామెడీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకీ-బుల్లిరాజు కాంబినేషన్ అదిరింది. ఈ కొత్త సినిమాలో చిరు-బుల్లిరాజు కామెడీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందంటున్నారు యూనిట్ జనం. అసలే కామెడీ టైమింగ్ లో చిరంజీవి నంబర్ వన్. ఇలాంటి నటుడితో బుల్లిరాజు కామెడీ అంటే నవ్వులే నవ్వులు.

అన్నట్టు ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. జనవరి 10 అనే తేదీని దాదాపు ఫిక్స్ చేశారు. 

Recent Posts

నాకు అలాంటివి ఇష్టమే: సప్తమి గౌడ

"కాంతార" సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది కన్నడ భామ సప్తమి గౌడ. ఆ సినిమాలో ఆమెది డీగ్లామర్ పాత్ర.… Read More

July 1, 2025

తమ్ముడు టైటిల్ వద్దన్న నితిన్

పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేయడంలో ముందుంటాడు హీరో నితిన్. కొన్ని సందర్భాల్లో అతడి మేనరిజమ్స్ చూస్తే, క్లియర్ గా… Read More

June 30, 2025

పుకారు నిజమైతే సూపర్!

ప్రస్తుతం రాశిఖన్నా ఇదే ఆనందంలో ఉంది. ఆమెపై తాజాగా ఓ పుకారు నడుస్తోంది. మహేష్, రాజమౌళి సినిమాలో ఓ కీలక… Read More

June 28, 2025

వీరి లెక్కలు, వంతులు వేరు

నాగచైతన్య, శోభిత వంతులేసుకుంటున్నారు. ఒక్కో వీకెండ్ ను ఒక్కొక్కరు పంచుకుంటున్నారు. అవును.. ఒక వీకెండ్ నాగచైతన్య చెప్పినట్టు శోభిత ఉండాలి.… Read More

June 28, 2025

ఇంటి పేరు… పేరున ఇల్లు!

సిద్దార్థ్ తెలంగాణ అల్లుడనే విషయం తెలిసిందే. ఎప్పుడైతే అదితి రావు మెడలో మూడు ముళ్లు వేశాడో, అప్పుడే తెలంగాణ అల్లుడు… Read More

June 28, 2025

రష్మిక ముందే సిద్ధం అవుతోందా

రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More

June 28, 2025