న్యూస్

సుధీర్ బాబుకి బాలీవుడ్ హీరోయిన్

Published by

సుధీర్ బాబు “జటాధర” అనే సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే ఈ సినిమా ప్రచారం మొదలుపెట్టాడు ఈ హీరో. ఇప్పటికే ఓ పోస్టర్ రిలీజ్ చేయగా, తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమా నుంచి విడుద‌లైన కొత్త పోస్ట‌ర్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత‌గా పెంచుతోంది. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు స‌రికొత్త లుక్‌తో, శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం “జటాధర” సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా లెవల్లో వచ్చే ఏడాది శివరాత్రికి సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాబోతున్న జ‌టాధ‌ర సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. అలాగే ఓ బాలీవుడ్ నటుడ్ని విలన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025