నాగార్జున, బాలకృష్ణ మధ్య ఉన్న అభిప్రాయబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఒక దానిపై మరొకటి పేర్చినట్టు వరుస ఘటనలతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్-స్టాపబుల్ కు చాలామంది హీరోలొచ్చారు గాని నాగ్ మాత్రం రాలేదు. ఇకపై కూడా రారు.
రీసెంట్ గా బాలయ్య 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. నాగార్జున మాత్రం రాలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏ స్థాయిలో గొడవలున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి విషయాల్లో బాలయ్యకు పట్టింపులు మరింత ఎక్కువ. తనకు సంబంధం లేదనుకుంటే ఆయన అస్సలు మాట్లాడడు. అలాంటి వ్యక్తి నాగార్జునను లెజెండ్ గా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్నారు బాలయ్య. టాలీవుడ్ కు అందించిన సేవలకు గాను లెగసీ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో ఆయన కాసేపు మాట్లాడారు. సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్నించాడు కరణ్.
ముందుగా ఈ ప్రశ్నను స్కిప్ చేయాలనుకున్నాడు బాలకృష్ణ. టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా.. బాలీవుడ్ ఖాన్ హీరోల్లో మీకు ఎవరంటే ఇష్టమని కరణ్ ను ప్రశ్నించాడు. వెంటనే కరణ్ తడుముకోకుండా తనకు షారూక్ అంటే ఇష్టమని చెప్పాడు. తిరిగి తన ప్రశ్నను రిపీట్ చేశాడు కరణ్. దీంతో బాలయ్య స్పందించక తప్పలేదు. తనకు ఎవరంటే ఇష్టమనే విషయాన్ని నేరుగా చెప్పకుండా.. తన సమకాలీకులైన నాగ్, చిరు, వెంకీ ముగ్గురూ లెజెండ్స్ అంటూ స్పందించాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More