అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి కలిసి చేయబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించనప్పటికీ, బన్నీ నెక్ట్స్ మూవీ అదేనని అందరికీ తెలుసు. ఇప్పటికే అల్లు అరవింద్, బన్నీ వాస్, నాగవంశీ లాంటి చాలామంది ఈ సినిమాపై చాలా ఎలివేషన్లు ఇచ్చారు.
పైగా ‘పుష్ప-2’ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బన్నీ- త్రివిక్రమ్ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ సినిమాపై కొత్త ప్రచారం మొదలైంది. ఈ ప్రాజెక్ట్ కు ఉగాదిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఉగాది రోజున సినిమాను ప్రకటిస్తారా లేక ఆ రోజున సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారా అనే విషయం తెలియదు కానీ బన్నీ-త్రివిక్రమ్ సినిమా చుట్టూ ‘ఉగాది’ పేరు గట్టిగా వినిపిస్తోంది.
ఈ సినిమాకు ఓ ప్రోమో ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని నాగవంశీ గతంలో ప్రకటించాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ప్రోమో షూట్ చేసి, సినిమాను ఆర్భాటంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు.దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ప్రకటనకు ముందునుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు చేశారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More