అల్లు అర్జున్ తనకి మూడు హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కి హ్యాండిచ్చారు. దాంతో, త్రివిక్రమ్ వరుసగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు. మరి అల్లు అర్జున్ కొత్తగా ఏ సినిమా ఒప్పుకున్నాడో తెలుసా?
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మలయాళ దర్శకుడితో పని చేస్తాడట. మలయాళంలో మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన యువ దర్శకుడు బేసిల్ జోసెఫ్ చెప్పిన కథ అల్లు అర్జున్ కి నచ్చింది అని అంటున్నారు. ఆ సినిమాకి అల్లు అర్జున్ ఓకె చేసినట్లు సమాచారం.
అల్లు అర్జున్ కి బేసిల్ జోసెఫ్ చెప్పిన కథ బాగా నచిందట. ‘మిన్నల్ మురళి’ అనే సూపర్ హీరో మూవీ తీశాడు ఈ దర్శకుడు. ఆ మలయాళ చిత్రానికి బాగా పేరు వచ్చింది. ఐతే, 2021లో విడుదలైన ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీయలేదు ఈ యువ దర్శకుడు. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాడు. నాలుగేళ్లుగా ఒక్క సినిమా డైరెక్ట్ చెయ్యని ఇతను చెప్పిన కథకు ఎగ్జైట్ అయి త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టాడని అంటున్నారు.
ప్రస్తుతం తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్న బన్నీ తమిళ మార్కెట్ ని కైవసం చేసుకొనే ఆలోచనలో ఉన్నాడు. మలయాళంలో ఇప్పటికే బన్నీకి క్రేజ్ ఉంది. సో ఈ మలయాళ దర్శకుడితో సినిమా చేస్తే అక్కడి మార్కెట్ మరింత సుస్థిరం అవుతుంది తనకి అని భావిస్తున్నాడట. ఇప్పటికే హిందీలో భారీ మార్కెట్ ఉంది. ఇలా పాన్ ఇండియన్ మార్కెట్ ప్లాన్ తో కొత్త సినిమాలు ఒప్పుకుంటున్నట్లు టాక్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More