న్యూస్

బాఫ్ట రేసులో ఇండియన్ మూవీ

Published by

ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, బాఫ్ట (బ్రిటిష్ ఫిలిం) అవార్డులు … ఇలా వరుసగా అవార్డుల కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి ఏడాది ఇవి వరుసగా జరుగుతాయి. ఈ సారి ఆస్కార్ రేసులో మన దేశం నుంచి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తీసిన “లాపతా లేడీస్” పోటీ పడింది. కానీ ఈ సినిమాని అవార్డుల నామినేషన్ కి కూడా వెళ్లలేకపోయింది.

ఐతే, ఈ సారి ఆస్కార్ సంగతేమో కానీ గోల్డెన్ గ్లోబ్, ​బాఫ్ట అవార్డుల్లో మరో భారతీయ చిత్రం “ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (​All We Imagine as Light) అనే చిత్రం మాత్రం పోటీలో నిలవనుంది. ఇప్పటికీ ఈ రెండు అవార్డుల లాంగ్ లిస్ట్ లో ఈ సినిమాకి చోటు ​దక్కింది. అంటే పోటీలో ఉన్నట్లే.

విదేశీ చిత్రం కేటగిరిలోనూ, ఉత్తమ దర్శకత్వం కేటగిరిలోనూ ఈ సినిమా బాఫ్ట అవార్డుల లిస్టులో ఉంది.

గోల్డెన్ గ్లోబ్ కానీ, బాఫ్ట అవార్డు కానీ ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది అని టాక్ ఉంది. మలయాళం, ఇంగ్లీష్ లో తీసిన ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకురాలు.  ఈ సినిమాని ఇండియాలో మన తెలుగు హీరో రానా విడుదల చేశాడు. కానీ థియేటర్లో సరిగా ఆడలేదు.

దివ్య ప్రభ, కాను కస్తూరి, ఛాయ నటించిన ఈ చిత్రం ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథ. మొత్తంగా ముంబైలోనే సాగుతుంది కథ. 

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025