సినిమా షూటింగ్ తో పాటే ప్రచారం చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్. కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచే ప్రమోషన్ కూడా మొదలుపెడుతున్నారు. ‘అఖండ-2’ సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
ఓపెనింగ్ నుంచే అదరగొడుతున్న ఈ సినిమా తాజాగా సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. మహా కుంభమేళాలో కూడా షూటింగ్ చేశారు. ఈమధ్యనే సెట్స్ పైకొచ్చిన ఈ సినిమా నుంచి అప్పుడే ఫస్ట్ లుక్ రెడీ అయింది.
శివరాత్రికి ‘అఖండ-2’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అఘోరాగా కనిపించబోతున్నాడు బాలయ్య. కాబట్టి శివరాత్రికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అన్ని విధాలుగా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ‘అఖండ-2’ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More