ఆదితి రావు, సిద్ధార్థ్… ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. సంజయ్ లీలా భన్సాలీ తీసిన “హీరామండి” వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో మే ఒకటో తేదీన ప్రీమియర్ కానుంది. ఆ సిరీస్ లో ఒక పాత్ర పోషించింది ఆదితి రావు. దాంతో ఆమె ఆ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది.
ప్రమోషన్ లో భాగంగా మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనివార్యంగా ఆమె పెళ్లి గురించి ప్రస్తావన వస్తోంది. దాంతో, అందరికీ ఒకటే సమాధానం చెప్తోంది. “మా పెళ్లి ముహూర్తం ఇంకా సెట్ కాలేదు. పెళ్ళికి ఇంకా చాలా టైముంది. ముహూర్తం కుదిరాక మేమే ప్రకటిస్తాం. దయచేసి మీరు అదే ప్రశ్న పదే పదే అడగొద్దు,” అని కోరుతోంది ఆదితి.
ఆదితి, సిద్ధార్థ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. వనపర్తి దగ్గరలోని ఒక ఆలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరి పెళ్లి డేట్ గురించి అందరిలో ఆసక్తి పెరిగింది.
ఆదితి, సిద్ధార్థ్ మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్నారు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More