సీజన్ ముగియడానికి సరిగ్గా మరికొన్ని రోజులు మాత్రమే ఉందనగా.. బిగ్ బాస్ హౌజ్ గ్లామర్ కోల్పోయింది. హౌజ్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. గేమ్ తో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ తన అందచందాలతో ఆకట్టుకున్న విష్ణుప్రియ చివరాఖరుకు హౌజ్ నుంచి నిష్క్రమించింది.
దాదాపు 3 నెలల పాటు ఆమె హౌజ్ లో కొనసాగింది. నిజానికి ఆమె ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు గేమ్ తో సంబంధం లేకుండా వ్యవహరించేది విష్ణుప్రియ. ఒక దశలో పృధ్వీతో ఆమె ప్రేమాయణం సాగించినట్టు ప్రకటించుకుంది. తన ప్రేమను కూడా వ్యక్తం చేసింది.
అలా హౌజ్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది, కానీ విష్ణు ప్రియ సొంత గేమ్స్ హౌజ్ లో పనిచేయలేదు. దానికితోడు ఆమె నోటి దురుసు, నిర్లక్ష్యంతో చేసిన తప్పులు ఆమెను ఎలిమినేషన్ వైపు లాగేశాయి.
ఎలిమినేట్ అయినప్పటికీ డబ్బుల పరంగా విష్ణుప్రియకు బాగానే గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి 45 రోజులకే ఆమె హౌజ్ నుంచి బయటపడాలి. ఆ తర్వాత షరతులు-నిబంధనలు-పేమెంట్స్ లో చిన్నచిన్న మార్పులు చేసుకొని, ఇన్నాళ్లూ ఆమె కొనసాగినట్టు చెబుతారు. తాజా సమాచారం ప్రకారం, విష్ణుప్రియ రూ.45 లక్షలు పేమెంట్ తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఇదే అత్యథికం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More