దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా చెయ్యబోతున్నాడు, ఆ సినిమా చెయ్యబోతున్నాడు అంటూ కొన్నాళ్లుగా ట్విట్టర్ లో తెగ ప్రచారం జరుగుతోంది. ఒక్కో ట్విట్టర్ హ్యాండిల్ తమకే ఎక్స్ క్లూజివ్ గా తెలిసినట్లు వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఐతే, ఇన్ని ప్రాజెక్ట్స్ లలో ఏ ప్రాజెక్ట్ ఆయన చేస్తాడో తెలీదు. ఇప్పటివరకు అధికారకంగా ప్రకటన రాలేదు.
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఉండాల్సిన సినిమా పక్కకు వెళ్ళింది. తన తదుపరి చిత్రంగా అట్లీ డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ షురూ చేశాడు అల్లు అర్జున్. దాంతో, తన సినిమాల లైనప్ ని త్రివిక్రమ్ సెట్ చేసుకుంటున్నాడు. వెంకటేష్ తోనే ఒక కొత్త సినిమా ఉంటుంది అని చాలా కాలంగా వినిపిస్తోంది. ఆ సినిమాకి సంబంధించి కూడా ఇంతవరకు ప్రకటన రాలేదు.
త్రివిక్రమ్ ఎందుకింత టైం తీసుకుంటున్నాడో మరి.
త్రివిక్రమ్ ఇలా నిశ్శబ్దంగా ఉండడంతో ఆయన సినిమాల గురించి, కాంబినేషన్ల గురించి సౌండ్ మాత్రం ఎక్కువ అవుతోంది. మరి ఆయన ఎప్పుడు పెదవి విప్పుతాడో చూడాలి.
“గుంటూరు కారం” విడుదల తర్వాత ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చెయ్యలేదు. మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” గతేడాది జనవరిలో ప్రారంభం అయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More