తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దంటూ నయనతార చేసిన విజ్ఞప్తిపై చాలామంది పాజిటివ్ గా స్పందించారు. ఆమెను అంతా ఆదర్శంగా తీసుకోవాలంటూ సూక్తులు వల్లించారు. అలా పొగడ్తల వర్షం చల్లారిన కొద్దిసేపటికి విమర్శల వాన మొదలైంది.
కేవలం పీఆర్ స్టంట్ లో భాగంగా నయనతార ఇలా లేడీ సూపర్ స్టార్ అస్త్రాన్ని బయటకు తీసినట్టు చెబుతున్నారు కొంతమంది. రీసెంట్ గా ఆమెపై పెద్దగా బజ్ లేదని, జనాల్లో నలిగేందుకు ఇలా ఈ అంశాన్ని ఆమె తెరపైకి తెచ్చినట్టు కొందరు చెబుతున్నారు.
తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దంటూ నయనతార కోరితే జనాలు ఆగరని, ఆమెను అలానే పిలుస్తారని, నయనతారకు కూడా కావాల్సింది అదేనని అంటున్నారు మరికొంతమంది. స్తబ్జుగా ఉన్న తన ఇమేజ్ ను ఇంకాస్త పెంచుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నారు.
ALSO READ: Nayanthara rejects the ‘Lady Superstar’ tag
మొన్నటికిమొన్న ధనుష్ పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది నయనతార. కొన్ని రోజుల పాటు ఆ వ్యవహారం ఆమెకు మంచి బజ్ తెచ్చిపెట్టింది.
భర్తతో వీడియోలు, పిల్లలతో దిగుతున్న ఫొటోల్ని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఇలా కొత్త స్ట్రాటజీతో నయనతార మీడియాలోకి వచ్చిందంటున్నారు చాలామంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More