నిజం చెప్పాలంటే “కేజీఎఫ్” బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎక్కడో ఉండాల్సిన భామ. “కేజీఎఫ్”, “కేజీఎఫ్ 2″లు దేశమంతా అన్ని భాషల్లో ఆడాయి. మన దేశంలో అతిపెద్ద హిట్ చిత్రాల్లో “”కేజీఎఫ్ 2” ఒకటి. అంత భారీ హిట్ మూవీలో నటించినా శ్రీనిధికి భారీ మూవీస్ దక్కకపోవడం విచిత్రం.
ఆమెకి సొంత చిత్ర పరిశ్రమ “కన్నడ సినిమా”లో కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. తమిళంలో రెండు సినిమాలు చేసింది. కానీ అవి కలిసి రాలేదు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడం లేదు. దాంతో, ఈ భామ ఇప్పుడు ఫోకస్ టాలీవుడ్ పై పెట్టింది.
ఆమె తనకు తాను ఎక్కువ ఊహించుకోవడం, భారీగా పారితోషికం డిమాండ్ చెయ్యడం వల్లే అవకాశాలు పెద్దగా రాలేదు అనేది ఒక మాట. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు అవకాశాలు దక్కాయి.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకురాలు నీరజ కోన “తెలుసు కదా” అనే సినిమా తీస్తోంది. ఆమెకి ఇది మొదటి చిత్రం. ఈ సినిమాలో సిద్ధూ సరసన రాశి ఖన్నాతో పాటు శ్రీనిధి నటిస్తోంది. ఈ వారమే షూటింగ్ మొదలైంది. ఇప్పటికే రాశి ఖన్నా షూటింగ్ లో పాల్గొంటోంది. వచ్చే వారం శ్రీనిధి కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.
అలాగే, రానా నిర్మాతగా తీస్తున్న ఒక కొత్త సినిమాలో కూడా శ్రీనిధి నటించనుంది. సో, శ్రీనిధి తెలుగు యువ హీరోలు, మిడ్ రేంజ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది అన్నమాట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More