శృతిహాసన్ కు పాటలంటే ప్రాణం అనే సంగతి తెలిసిందే. ఖాళీ టైమ్ దొరికితే ఇంట్లో కీబోర్డ్ ముందు కూర్చొని ఏదో ఒక పాట హమ్ చేస్తుంది. అది కూడా ఒరిజినల్ సాంగ్. ఆ పాటను వెంటనే ఇనస్టాగ్రామ్ లో అప్ లోడ్ కూడా చేస్తుంది.
ఇలా పాటలపై తనకున్న మక్కువను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది. అందుకే ఓవైపు హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ, సింగింగ్ ప్రొఫెషన్ ను మాత్రం ఆమె వదల్లేదు. ఈ క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్టులోకి ఎంటరైంది శృతిహాసన్.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ ” (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ ఓ పాట పాడింది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.
రీసెంట్ గా ఓ ఒరిజినల్ సాంగ్ రిలీజ్ చేసింది శృతిహాసన్. అందులో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో కలిసి రొమాన్స్ చేసింది. ఇప్పుడు ఇలా విజయ్ సినిమా సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సాంగ్ చాలా స్పెషల్ అంటోంది యూనిట్. అది ఎందుకంత స్పెషల్ అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More