అవీ ఇవీ

ఆ పాత్రకి 10 కోట్లు?

Published by

సమంత టాప్ హీరోయిన్ అన్న మాట నిజమే కానీ ఆమె నటించిన సినిమా థియేటర్లో విడుదలై చాలా కాలమే అవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఆమె తెలుగులో సినిమా చెయ్యడం లేదు. తెలుగులోనే కాదు ఏ భాషలో కూడా నటించలేదు. కేవలం “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ మాత్రమే పూర్తి చేసింది.

తాజాగా ఆమె కొత్త సినిమా ఒకటి ఒప్పుకొంది. అలాగే మరో వెబ్ సిరీస్ (“రక్త బ్రహ్మాండ”) సైన్ చేసింది. కానీ ఆమెకి ఓటిటి మార్కెట్ లో, సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే, ఆమె సినిమాల్లో నటించి చాలా కాలమే అయినా, ఆమె సినిమా పారితోషికానికి దాదాపు డబుల్ మొత్తంలో డబ్బులు ఇచ్చిందట అమెజాన్ ప్రైమ్.

“సిటాడెల్: హానీ బన్నీ” అనే వెబ్ సిరీస్ లో ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఈ సిరీస్ లో నటించినందుకు ఆమెకి అక్షరాలా 10 కోట్ల రూపాయలు చెల్లించారట.  ఈ వెబ్ సిరీస్ ని తీసిన రాజ్ అండ్ డీకే ఆమెకి క్లోజ్ ఫ్రెండ్స్. వారు ఆమెకి ఇలా భారీ మొత్తం దక్కేలా చూసుకున్నట్లు ఉన్నారు.

సమంత గతేడాది “ఖుషి” సినిమాలో నటించింది. ఆ సినిమాకి ఆమె 4 కోట్ల రూపాయలు తీసుకొంది. అంటే వెబ్ సిరీస్ లో నటించినందుకు అమ్మయికి ఏకంగా డబుల్ కన్నా ఎక్కువే పారితోషికం దక్కింది.

మొత్తంగా సమంత సినిమాల్లో నటించకపోయినా సంపాదన పరంగా బాగానే ఆర్జిస్తోంది.

ఇక తెలుగులో ఆమె నటించే తదుపరి చిత్రం.. “మా ఇంటి బంగారం”. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమె.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025