అవీ ఇవీ

ఆ ఫోటోషూట్ పై కామెంట్లు

Published by

హీరోయిన్ రాధిక ఆప్టేకి ఇటీవలే కూతురు పుట్టింది. కూతురు పుట్టిన వారానికే తాను పనిలో పడ్డాను బేబీకి పాలు ఇస్తూ ముందు ల్యాప్ టాప్ పెట్టుకొని పనిచేస్తున్న ఫోటోని ఐదు రోజుల క్రితం షేర్ చేసింది. ఇక తాజాగా తన డెలివరీకి సరిగ్గా వారం రోజుల క్రితం ఆమె తన నిండు గర్భంతో ఫొటోషూట్ చేసింది.

ఒక మేగజైన్ కోసం ఆ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను ఇప్పుడు డెలివరీ తరవాత షేర్ చేసింది. గర్భిణిగా తన అనుభూతులను ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.

గర్భం దాల్చినప్పుడు ఎవరైనా ఆనందపడతారని, తను మాత్రం షాక్ అయ్యానని వెల్లడించింది. తనకు పాజిటివ్ అని తెలిసిన తర్వాత కొన్ని క్షణాల పాటు షాక్ అయ్యానని, అది అనుకోకుండా అలా జరిగిపోయిందని వెల్లడించింది.

నిండు గర్భిణిగా తనని తాను అద్దంలో చూసుకోలేకపోయాను అని, బాగా లావుగా కనిపించాను అని తెలిపింది రాధిక ఆప్టే. ఐతే ఇదంతా ప్రకృతి సహజం కాబట్టి బాధపడలేదు అని చెప్పింది.

అయితే ఆమె ఫోటోషూట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ శృతిమించినట్లు ఆ ఫోటోషూట్ ఉందని కామెంట్స్ పడుతున్నాయి.

రాధికా ఆప్టే, బ్రిటన్ కి చెందిన బెనడిక్ట్ టేలర్‌ 2012లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఏడాది లండన్ లో వీళ్లు కలుసుకున్నారు. కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. 2013లో వీళ్లు తమ పెళ్లి మేటర్ ను బయటపెట్టారు. పెళ్లి అయిన 12 ఏళ్లకు ఆమెకి మొదటి బిడ్డ కలిగింది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025