అనుష్క శెట్టి చాలాకాలంగా బరువు సమస్యతో బాధపడుతోంది. ఈ కారణంగానే ఆమె సినిమాలు తగ్గించింది. ఐతే, ఇటీవల ఆమె అనారోగ్య సమస్యలతో బయటపడి కొంచెం తగ్గింది. దాంతో సినిమాలు చెయ్యడం మొదలుపెట్టింది. అలా ఆమె ఇటీవల పూర్తి చేసిన మూవీ… ‘ఘాటి’.
ఈ రోజు ఆమె పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆమె మొదటి లుక్, అలాగే వీడియో గ్లిమ్ప్స్ విడుదల చేశారు. గంజాయి ఎగుమతి చేసే మాఫియా రాణి పాత్రలో అనుష్క అదుర్స్ అన్నట్లుగా ఉంది. ఉత్తరాంధ్ర, ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండించి అక్రమంగా సరఫరా చేసే వారిపై దర్శకుడు క్రిష్ తీస్తున్న మూవీ ఇది.
ఈ గ్లిమ్ప్స్ వీడియో చూస్తుంటే ఆమె లుక్ ని బాగానే తీసుకొచ్చారు దర్శకుడు. అనుష్కను యాక్షన్ అవతారంలో చూపిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే అమెజాన్ సంస్థ తీసుకొంది. దాంతో క్రిష్ ప్రశాంతంగా ఈ సినిమాని పూర్తి చేశాడు.
వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More