పెళ్లయిన హీరోయిన్లు ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ విషయంలో నార్త్-సౌత్ అనే తేడా కూడా చెరిగిపోయింది. బాలీవుడ్ లోనైతే పెళ్లయినా అందాలు ఆరబోస్తున్న భామలున్నారు. అలియా భట్ లాంటి హీరోయిన్లు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.
సౌత్ లో మాత్రం ఈ పరిస్థితిలో ఇంకా చెప్పుకోదగ్గ మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. పెళ్లయిన హీరోయిన్లకు మన దక్షిణాదిలో కూడా హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ పెళ్లి చేసుకొని తల్లి అయినా హీరోయిన్లను గ్లామర్ వొలకబోస్తే ఇబ్బంది పడుతున్నారు.
హీరోయిన్ ప్రణీత తాజాగా ట్రోలింగ్ కు గురైంది. దీనికి కారణం ఆమె బాత్ టబ్ లో దిగి ఫొటోలకు పోజులివ్వడమే. ఆమెకు పెళ్లయింది. తల్లి కూడా అయింది. తల్లయిన ప్రణీత, ఇలా బాత్ టబ్ లో బోల్డ్ గా పోజులివ్వడం ఏం బాగాలేదంటూ కొంతమంది కన్నడ, తమిళ ప్రేక్షకులు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.
నిజానికి బాత్ టబ్ లో ఫొటోషూట్ చేసినప్పటికీ ప్రణీత ఎక్కడా గీత దాటలేదు. అందులో ఎలాంటి అశ్లీలత కూడా లేదు. అయినప్పటికీ ఓ సెక్షన్ నెటిజన్లు, ట్వీట్లు పారేసుకుంటున్నారు.
ఇది కరెక్ట్ కాదంటున్నారు మరికొంతమంది. ఆమె తన కుటుంబ జీవితాన్ని, వృత్తిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తోందని, పెళ్లయి, బిడ్డకు తల్లయిన తర్వాత కూడా ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More