నటి పూనమ్ కౌర్ మరోసారి పాత ఆరోపణలను కొత్తగా చేసింది. కొన్ని గ్యాంగ్స్ తనను ఇండస్ట్రీ నుంచి తప్పుకునేలా చేశాయని ఆరోపించింది.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆమె బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపింది. సింపుల్ గా ‘జై బాలయ్య’ అనే స్లోగన్ ఇచ్చింది. అదే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడేం చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు. దీనిపై స్పందించిన పూనమ్, ఒకప్పుడు తను సినిమాలు చేసేదాన్నని, కొన్ని బ్యాచుల వల్ల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆరోపించింది.
మరోవైపు ఇదే అంశంపై ఆమె మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ కు ఫిర్యాదు చేశానని చెబుతోంది. అయితే అసోసియేషన్ మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటోంది. ఆఫీస్ కొచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరుతోంది. ప్రస్తుతం ఇదే విషయంపై ఆలోచన చేస్తోంది పూనమ్ కౌర్.
వాదన వినిపించడానికి తనకు మహిళా ప్యానెల్ కావాలని ఆమె కొన్ని రోజుల కిందట డిమాండ్ చేసింది. దీనిపై అసోసియేషన్ ఇంకా స్పందించలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More