ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయింది. అల్లు అర్జున్ చెయ్యాల్సిన సినిమా ఎన్టీఆర్ కి వచ్చింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో త్వరలోనే ఒక పౌరాణిక చిత్రం రూపొందనుంది. ఆ సినిమాకి ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. కానీ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ని “గాడ్ ఆఫ్ వార్”గా పిలుస్తున్నారు.
ఎన్టీఆర్ ఇటీవల తన మొదటి బాలీవుడ్ చిత్రం “వార్ 2” షూటింగ్ పూర్తి చేశాడు. “వార్ 2” ఆగస్టులో విడుదల కానుంది. ఇలా వార్ 2లో నటించి ఇప్పుడు త్రివిక్రమ్ తీసే “గాడ్ ఆఫ్ వార్”లో పాల్గొంటాడు అన్నమాట. కార్తికేయ, స్కంద, సుబ్రమణ్యస్వామి, మురగ… ఇలా పలు పేర్లతో కొలుస్తారు జనం కార్తికేయుడిని. కానీ, తమిళనాడు మినహా తెలుగునాట కానీ, భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కానీ సుబ్రమణ్యస్వామికి గుళ్ళు చాలా తక్కువ. కొలిచేది కూడా తక్కువే. కానీ పురాణాల్లో ఈ స్కందుడికి ‘దేవసేనుడి’గా బిరుదు ఉంది.
మొత్తం దేవతల సైన్యాన్ని నడిపించి తారకేసురుడి అనే రాక్షసుడిని సంహరించిన సుబ్రహ్మణ్యస్వామి దేవతలకు సైనిక అధ్యక్షుడు మారాడు. యుద్ధాలను గెలిపించిన వీరుడు. అందుకే గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారట. సో, ఈ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.
ఈ సినిమాలో దేవతల మహిమల కన్నా వార్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More