నిత్య మీనన్ కి ఉన్నట్టుండి తమిళంలో అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. మొదటి చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.
జయం రవి హీరోగా నిత్య హీరోయిన్ గా నటించిన “కాదలిక్క నేరమిల్లై” (Kadhalikka Neramillai) ఈ జనవరి 14న థియేటర్లలోకి వస్తుంది. అలాగే ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న “ఇడ్లి కడాయి” అనే చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ రెండూ ప్రముఖ హీరోలు నటించిన చిత్రాలే.
అలాగే విజయ్ సేతుపతితో ఒక మూవీ షూటింగ్ దశలో ఉంది. “డియర్ ఎక్స్ఎస్” అని చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం కూడా ఈ ఏడాది రానుంది. మొత్తంగా 2025లో ఈ భామ చాలా బిజీ ఆర్టిస్ట్ గా నిలవనుంది.
ఆ మధ్య బాగా లావు కావడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. తెలుగులో పూర్తిగా ఆఫర్లు బంద్ కావడానికి కారణం అదే. ఐతే ఉత్తమనటిగా పేరున్న ఈ భామ ఇటీవల బ్రేక్ తీసుకొని సరికొత్తగా దర్శనమిస్తోంది. కొత్త చిత్రాలు సైన్ చేస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More