గత మూడు, నాలుగేళ్లుగా నిధి అగర్వాల్ కేవలం రెండు సినిమాలతోనే బిజీగా ఉంది. ఆ సినిమా హీరోలు తమకున్న వ్యాపకాలతో షూటింగ్ లను ఏళ్ళ తరబడి పొడిగిస్తుండడంతో ఈ భామ అలా వాటితో స్టక్ అయిపొయింది. “హరి హర వీర మల్లు”, “ది రాజాసాబ్” షూటింగ్ లు పూర్తయ్యేవరకు మరో సినిమా చెయ్యకూడదు అని ఒప్పందం చేసుకోంది. అందుకే, ఈ నాలుగేళ్లలో కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే చేసింది.
అవి ఈ ఏడాది విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దాంతో, ఈ భామ ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ భామ ఐటెం సాంగ్ సైన్ చేసిందట.
ఇటీవల శ్రీలీల “పుష్ప 2″లో ఐటెం సాంగ్ చేసింది. ఇప్పుడు నిధి అగర్వాల్ “జాట్” అనే బాలీవుడ్ చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యనుందట. సన్నీ దియోల్ హీరోగా మన తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని తీస్తున్న ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ యాడ్ చెయ్యనున్నారు. అలా నిధిని అప్రోచ్ అయ్యారట.
నిధికి కూడా డబ్బులు కావాలి. “హరి హర వీర మల్లు”, “ది రాజాసాబ్” షూటింగ్ ల కారణంగా ఇతర సినిమాలు ఒప్పుకోలేదు. దాని వల్ల, ఆదాయం, సంపాదన తగ్గింది. ఈ ఐటెం సాంగ్ తో సులువుగా కోటి రూపాయలు వచ్చేస్తాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More