మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతకాలంగా మంచు కుటుంబం వీధుల్లోనే గొడవలు పెట్టుకుంటోంది. తాజాగా మంచు విష్ణు డైలాగ్ వార్ మొదలుపెట్టాడు.
తన తండ్రి నటించిన “రౌడీ” చిత్రంలోని డైలాగ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి తన సోదరుడు మనోజ్ కి చురకలంటించాడు విష్ణు. ఇక విష్ణుకి జవాబు అన్నట్లుగా మనోజ్ కూడా మోహన్ బాబు మరో సినిమాలోని డైలాగ్ ట్విట్టర్లో పెట్టి మరింత అగ్గి రాజేశాడు.
“సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ,” అని మోహన్ బాబు పలికిన ‘రౌడీ’ చిత్రంలోని డైలాగ్ క్లిప్ ని విష్ణు పోస్ట్ చేశాడు.
“కాలు దువ్వాలనుకుంటే అడుగుపెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం వల్లో వేసేవాణ్ని. నా ఆలీ సెప్పింది కాబట్టి…గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్ఛా,” అని మోహన్ బాబు డైలాగ్ ని మనోజ్ షేర్ చేశాడు. అంతే కాదు ఈ డైలాగ్ “#VisMith” కి అని పెట్టాడు. హాలీవుడ్ సినిమా అని క్లూ ఇచ్చాడు. అంటే విష్ణు గురించి అని చెప్పకనే చెప్పాడు.
మొత్తానికి అన్నదమ్ములిద్దరూ సింహాలు, కుక్కలు, పెళ్ళాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ఒకరిపై ఒకరు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More