హీరోయిన్ కావ్య థాపర్ కి పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఆమెకి అవకాశాలు మాత్రం చాలానే వస్తున్నాయి. అందాల ఆరబోతలో ఏ మాత్రం పొదుపు పాటించని భామ.
ఈ భామ ఇప్పుడు ఇంకో సినిమాతో మనల్ని పలకరించనుంది. ‘దూకుడు’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ శ్రీను వైట్ల తీస్తున్న కొత్త సినిమాలో ఈ భామ హీరోయిన్. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. అంటే ఈ సినిమా ఈ ఏడాది ఆమెకి నాలుగోది.
ఈ ఏడాది కావ్య థాపర్ రవితేజ సరసన “ఈగిల్” అనే చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరిలో విడుదలైన “ఈగిల్” ఆడలేదు. ఆ తర్వాత అదే నెలలో విడుదలైన “ఊరు పేరు భైరవకోన”లో కూడా నటించింది. అది ఓ మోస్తరు విజయం సాధించింది. ఇక గత నెలలో పూరి తీసిన “డబుల్ ఇస్మార్ట్”లో రామ్ సరసన నటించింది. అది ఘోర పరాజయం పాలైంది.
ఇప్పుడు ‘విశ్వం’తో నాలుగోసారి ఈ ఏడాది మన ముందుకొస్తోంది.
“గోపిచంద్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా చాలా జాయ్ ఫుల్ జర్నీ,” అని కూడా చెప్తోంది ఈ భామ. మరి ఈ సినిమా అయినా ఆమెకి క్రేజ్ తెస్తుందా అనేది చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More