హీరోయిన్లు చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తారు. అదే టైమ్ లో చాలా కష్టపడతారు కూడా. ముఖ్యంగా బరువు మేనేజ్ చెయ్యడం కోసం వాళ్ళు పడే కష్ఠాలు అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఆమె యాక్సిడెంట్ కు గురైంది. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడంతో కాస్త లావెక్కింది.
అదే సమయంలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాధ్. “డబుల్ ఇస్మార్ట్”లో నటించాలంటే బరువు తగ్గాలని చెప్పారట. ఆమెకు 2 నెలలు టైమ్ ఇచ్చి స్లిమ్ అవ్వాలని చెప్పారట.
ఆ మాటని ఛాలెంజింగ్ గా తీసుకొని 2 నెలల్లో బరువు తగ్గి చూపించిందట కావ్య. అలా “డబుల్ ఇస్మార్ట్”లో రామ్ సరసన నటించింది.
అంత కష్టపడినా ఆమెకి కలిగిన ప్రయోజనం ఏమి లేదు. ఆమెకి దక్కిన పాత్రలో కొత్తదనం లేదు. సినిమా కూడా దారుణ పరాజయం చూసింది. రెండు నెలలు శ్రమించి బరువు తగ్గితే సినిమా రెండు రోజులు కూడా ఆడలేదు.
కావ్య థాపర్ ఖాతాలో మరో ఫ్లాప్ గా నిలిచింది ఆ మూవీ. ఆమె ఇంతకుముందు తెలుగులో “ఏక్ మినీ కథ” (డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్), “ఈగిల్” (ఫ్లాప్), “బిచ్చగాడు 2” (యావరేజ్), “ఊరు పేరు భైరవకోన” (యావరేజ్) చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు గోపీచంద్ సరసన “విశ్వం”అనే సినిమాలో నటిస్తోంది. శ్రీను వైట్ల తీస్తున్న ఈ మూవీ ఆడితేనే ఆమెకి కెరీర్ ఉంటుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More