18 ఏళ్లుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న కంగనా రనౌత్, నటిగా ఉండడం తనకు అసహ్యం అని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. మరి ఇన్నేళ్లు ఎలా కొనసాగారు అని అడిగితే, జీవితంలో చాలా టైమ్ వేస్ట్ అయిందని చెప్పుకొచ్చింది.
“మీకు తెలుసా. నటిగా ఉండడం నాకు అసహ్యం. మామూలు అసహ్యం కాదు, పరమ అసహ్యం. ఎందుకనేది నేను సూటిగా చెప్పలేను. సెట్స్ కు వస్తే ఏం జరుగుతుందో చూడ్డానికే సరిపోతుంది. నా జీవితంలో చాలా సమయం వృధా అయింది. మనందరికీ చాలా తక్కువ టైమ్ ఉంది. ఆ ఉన్న టైమ్ సెట్స్ లో వేస్ట్ అవుతుంది.”
షాట్ రెడీ అని అసిస్టెంట్ డైరక్టర్ చెబుతాడు, లేచి నిల్చొనే లోపే ఆగండి.. అంటాడట. మెయిన్ లీడ్ గా చేసిన సినిమాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతోంది కంగన. ఇలా తన జీవితంలో చాలా సమయం వృధా అయిందని అంటోంది.
మరి ఆమెకు ఏం ఇష్టం?
డైరక్టర్ గా ఉండడం ఇష్టం అంట. ఎందుకంటే ప్రతి నిమిషం ఆలోచిస్తామంట. ప్రతి నిమిషం చేతిలో పని ఉంటుందట. అలాంటి పని చేయడానికి తను ఇష్టపడతానని, షాట్ రెడీ అయ్యేంతవరకు కుర్చీలో కూర్చోవడం అసహ్యం అంటోంది.
ఆమె డైరెక్ట్ చేసిన “ఎమెర్జెన్సీ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సో… ఈ సినిమా ప్రమోషన్లో ఇలా మాట్లాడింది. ఈ సినిమాలో కంగన ఇందిరాగాంధీగా నటించింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More