మొన్నటివరకు స్టార్ హీరోయిన్లతో పనిచేశాడు ప్రభాస్. దీపిక, శృతిహాసన్, శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్లకు అదిరిపోయే ఆతిథ్యం అందించాడు. నోరూరించే రుచుల్ని స్వయంగా ఇంట్లో చేయించి వడ్డించాడు.
ఇప్పుడు ఇమాన్వి అనే కొత్తమ్మాయితో సినిమా చేస్తున్నాడు. ఈమె దగ్గర కూడా ఆతిధ్యం విషయంలో తగ్గలేదు ప్రభాస్. కొత్త హీరోయిన్ కదా అని తన ట్రీట్ మెంట్ తగ్గించలేదు. ఆమెకు కూడా తనదైన జంబో మీల్స్ ను రుచిచూపించాడు.
ప్రభాస్ పంపించిన వంటకాల్ని స్వయంగా ఇమాన్వి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రభాస్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది.
ప్రభాస్ గౌరవమర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అతడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఆ విషయాన్ని చెబుతారు. హీరోయిన్లు మాత్రమే కాదు, పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి నటులు కూడా ప్రభాస్ అతిథి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయారు.
ఒకానొక టైమ్ లో హైదరాబాద్ లో వారం రోజుల పాటు చక్కర్లు కొట్టడం కోసం, ప్రభాస్ ఏకంగా తన రేంజ్ రోవర్ కారును తనకు ఇవ్వబోయాడని, అది తనకు చాలా అశ్చర్యం కలిగించిందని అన్నాడు పృధ్వీరాజ్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More