పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి ఉంది. ఏకంగా ఏపీ రాజీకీయాలను మార్చేశారు పవన్ కళ్యాణ్ తన క్రేజ్ తో. ఐతే, రాజకీయంగా ఆయన పవర్ ఎంత ఉన్నా… సినిమా పరంగా ఆయన సత్తా ఎంత అనేది చెప్పలేం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు.
మారిన పరిస్థితుల్లో ఆయన సినిమాని అభిమానులు, సామాన్య ప్రేక్షకులే కాదు సొంత పార్టీ కార్యకర్తలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎగబడి చూస్తే కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు వస్తాయి. ఐతే, అలా జరుగుతుందా? అది కూడా పెద్దగా హైప్ లేని “హరి హర వీర మల్లు” విషయంలో అనే డౌట్ ఉంది.
“హరి హర వీర మల్లు” హైప్ కోల్పోవడానికి ప్రధాన కారణం… ఏళ్లుగా నిర్మాణంలో ఉండడం, ఒక పదిసార్లు విడుదల వాయిదా పడడం. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ మారడం కూడా మరో రీజన్.
మొత్తానికి ఇప్పుడు థియేటర్లలోకి రానుంది. ఐతే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల హక్కుల నుంచి నిర్మాత రత్నం ఏకంగా వంద కోట్ల రూపాయలు ఆశిస్తున్నారట. ఏపీ మొత్తంగా 100 కోట్ల రేషియాలో వివిధ జిల్లాలకు సినిమాని అమ్మాలని భావిస్తున్నారు. రత్నం ఆశిస్తున్నా మొత్తం డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారా?
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More