గోపీచంద్ మరోసారి తన ఫ్రెండ్ ప్రభాస్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ వేషాలు వేసిన ఈ హీరో, ప్రభాస్ అడిగితే అతడి సినిమాలో విలన్ గా చేసేందుకు ఓకే అన్నాడు.
“ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. విలన్ రోల్ చేయాలంటే ఏదో ఫైట్స్ కోసం కాకుండా, ఆ పాత్రలో చాలా డెప్త్ ఉండాలి. అలాంటి రోల్స్ రావడం లేదు. అయితే ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే మాత్రం చేస్తాను.”
కెరీర్ ప్రారంభంలో తను చేసిన 3 విలన్ పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో అలానే ఉండిపోయాయని, ఆ పాత్రల్లో గాఢత అలాంటిదని చెప్పుకొచ్చాడు గోపీచంద్. అందుకే తను హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ, విలన్ పాత్ర చేస్తే చూడాలని కొంతమంది కోరుకోవడం సహజమన్నాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ సినిమా చేశాడు గోపీచంద్. ఈ సినిమా ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకొచ్చాడు. విశ్వం సినిమా పూర్తిగా శ్రీనువైట్ల స్టయిల్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More