ఒక సినిమా మరొకరి చేతికి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో కొన్ని గాసిప్స్ కూడా పుట్టుకొస్తుంటాయి. ఇది అలాంటిదే. దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ముందుగా నానితో అనుకున్నారట. అయితే మరోసారి తండ్రిగా నటించడానికి నాని అంగీకరించలేదంట. ఆయన తిరస్కరించిన తర్వాత దుల్కర్ ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై దర్శకుడు స్పందించాడు.
ఈ కథ రాసుకున్న వెంటనే దుల్కర్ అయితే బాగుంటుందని తనతో పాటు నిర్మాత కూడా ఫీల్ అయ్యారని.. ఎందుకంటే అప్పటికే దుల్కర్ పీరియాడిక్ ప్రాజెక్టులు చేసి ఉన్నాడు కాబట్టి, అతడ్ని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారని దర్శకుడు వెంకీ అభిప్రాయపడ్డాడు
అలా కథ పూర్తయిన వెంటనే ‘వైజయంతీ మూవీస్’ స్వప్న ద్వారా దుల్కర్ ను కలిసి, మొదటి సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ అందుకున్నానని దర్శకుడు వెల్లడించాడు. మనం రాసుకున్న కథకు మొదటి సిట్టింగ్ లోనే హీరో నుంచి అనుమతి వస్తే.. ఆ కిక్కే వేరంటున్నాడు వెంకీ అట్లూరి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More