సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. 29 ఏళ్ల వారి కాపురానికి అలా ముగింపు పడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకే, రెహమాన్, ఆయన భార్య మధ్య విభేదాలకు కారణం ఏంటి అనే విషయంలో రకరకాల పుకార్లకు కారణమైంది. అందులో ప్రధానంగా వినిపించిన మాట.. రెహమాన్ తన వద్ద పనిచేసిన మోహిని దే అనే సంగీత వాద్య కళాకారిణితో అనుబంధమే ఆయన విడాకులకు దారితీసింది అనే సోషల్ మీడియా కోడై కూసింది.
ఐతే, ఈ పుకార్లని పట్టించుకోను, అర్థంపర్థం లేని వాటికి స్పందించలేను అంటూ మోహిని ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది. ఇక రెహమాన్ కొడుకు అమీన్ కూడా స్పందించాడు. మా నాన్న విలువలు, వ్యక్తితం తెలిసిన వారెవ్వరూ ఇలాంటి పిచ్చి పుకార్లు పుట్టించరు అని అన్నాడు.
ALSO READ: Mohini reacts to link-up reports with AR Rahman
చివరికి రెహమాన్ కూడా ఘాటుగా హెచ్చరిక చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటి పుకార్లు ప్రచారం చేస్తున్న మీడియా, సోషల్ మీడియా అకౌంట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని ప్రకటించారు.
“24 గంటల్లో తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేసిన అబద్దాలను తొలగించకపోతే చర్యలు తీసుకుంటాను,” అని రెహమాన్ తన లాయర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More