ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విడాకుల పుకార్లు కొత్తవేం కావు. కొన్ని నెలలుగా వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి విడాకులపై పుకార్లు మొదలయ్యాయి. దీనికి కారణం నిమ్రత్ కౌర్. ఈమెతో రెండేళ్ల కిందట ఓ సినిమా చేశాడు అభిషేక్. ఆ టైమ్ లోనే ఇద్దరూ బాగా దగ్గరయ్యారనే పుకార్లు వచ్చాయి.
ఇప్పటికీ ఆమెకు అభిషేక్ క్లోజ్ గానే ఉన్నాడని, ఎప్పటికప్పుడు ఇద్దరూ కలుసుకుంటున్నారనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్రత్ కౌర్, ముంబయిలో ప్రత్యక్షమవ్వడం మరింత కలకలం రేపింది.
ఢిల్లీలో ఉండే నిమ్రత్.. ఓ ఈవెంట్ కోసం ముంబయి వచ్చింది. ఆమె ఇలా ల్యాండ్ అయిందో లేదో, మరోసారి ఐష్-అభి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి.
42 ఏళ్ల నిమ్రత్ కౌర్, పలు హిందీ సినిమాలతో పాటు అమెరికన్ టెలివిజన్ షోలు కూడా చేసింది. 17 ఏళ్లకే మోడలింగ్ లోకి ప్రవేశించిన ఈమె. ‘ది లంచ్ బాక్స్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. 48 ఏళ్ల అభిషేక్, ఈమెకు దగ్గరైనట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది.
మరోవైపు ఐశ్వర్య రాయ్, భర్త లేకుండానే కార్యక్రమాలకు హాజరవుతోంది. తాజాగా తన బంధువు ఇంట జరిగిన ఓ బర్త్ డే పార్టీకి కూడా సింగిల్ గానే వెళ్లింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More