ఎన్నికలకు ముందు బన్నీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సరిగ్గా కొన్ని రోజుల్లో పోలింగ్ ఉందనగా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు బన్నీ. ఇటు తన కుటుంబ సభ్యుడు పవన్ కల్యాణ్ కోసం ట్వీట్ వేశాడు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలంటూ ట్వీట్ వేశాడు.
ఆ వెంటనే తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లాడు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన శిల్పా రవిచంద్ర తరఫున ప్రచారం చేశాడు. కట్ చేస్తే, ఇప్పుడు పవన్ కల్యాణ్ గెలిచారు. శిల్పా ఓడిపోయారు. సరిగ్గా ఇక్కడే బన్నీ ఫ్యూచర్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
త్వరలోనే జనసేన ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరుతుంది. అలా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలకే బన్నీ నుంచి పుష్ప-2 వస్తోంది. మరి అల్లు అర్జున్ చేసిన ఈ పనికి, అతడు ఆంధ్రాలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటాడా?
ప్రస్తుతం ఇదే కోణంలో చర్చ సాగుతోంది. శిల్పా తనకు ఆప్తుడు కాబట్టి నంద్యాల వెళ్లానని, తనకు రాజకీయాలతో సంబంధం లేదని బన్నీ గతంలో తనకుతాను ప్రకటించుకున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇవన్నీ పట్టించుకోకపోతే ఏపీ ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సమస్య ఉండదు బన్నీకి.
ఐతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ గా ఊరుకుంటారా? ఎందుకంటే పవన్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More