హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.
ఈ రోజు ధన్సిక నటించిన ‘యోగిదా’ సినిమా ఫంక్షన్ జరిగింది. ఈ వేదికపై విశాల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. తన జీవిత భాగస్వామిని కనుగొన్నానని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.
ఇదే విషయాన్ని, అదే సభలో ధన్సిక కూడా బయటపెట్టింది. తామిద్దరం ఎప్పట్నుంచో ప్రేమించుకుంటున్నామని, రీసెంట్ గా పెళ్లి గురించి మాట్లాడుకున్నామని, ఆగస్ట్ 29న పెళ్లి చేసుకుంటున్నామని ప్రకటించింది.
ఓ పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ధన్సిక ఇంటికొచ్చి ఓదార్చాడంట విశాల్. అప్పుడే ఇద్దరి మధ్య ఓ మేజిక్ మూమెంట్ క్రియేట్ అయిందంట. అప్పట్నుంచి టచ్ లోనే ఉన్నామని, ఆ తర్వాత ప్రేమలో పడ్డామని, ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నామని తెలిపింది సాయిధన్సిక.
ఎవరీ సాయి ధన్సిక
సాయి ధన్సికకి 35 ఏళ్ళు. విశాల్ కి 47 ఏళ్ళు. సాయి ధన్సిక తమిళ సినిమాల్లో చాలా కాలంగా నటిస్తోంది. “పరదేశి”, “లాభం”, “కబాలి” వంటి సినిమాల్లో నటించింది. “కబాలి”లో రజినీకాంత్ కూతురిగా కనిపించింది. ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 18 ఏళ్లుగా నటిస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More