పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కూటమి అభ్యర్థుల కోసం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో పలువురు సినిమా సెలెబ్రిటీలు ప్రచారం మొదలుపెట్టారు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా జాయిన్ అవుతున్నాడు. వరుణ్ తేజ్ శనివారం (ఏప్రిల్ 27) పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటాడు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం “మట్కా” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కి గ్యాప్ దొరికింది. దాంతో తనవంతుగా జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు వరుణ్ తేజ్ అడుగు ముందుకేశాడు. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఈ సారి ఎన్నికల బరిలో లేరు కానీ జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఆయనది చురుకైన పాత్ర.
ఇక వరుణ్ తేజ్ తో పాటు మిగతా మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు బయటికి రాకపోవచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎదో ఒక రోజు ప్రచారం చేస్తారు అనే మాట వినిపిస్తోంది.
జనసేన – తెలుగు దేశం పార్టీ – భారతీయ జనతా పార్టీ కలిసి ఈ సారి పోటీ చేస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More