న్యూస్

మెగా ఫ్యామిలీలో పెద్ద క్రిటిక్

Published by

మెగా కాంపౌండ్ కు పెద్ద దిక్కు చిరంజీవి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న మెగా హీరోలంతా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. ఇప్పటికీ తన కుటుంబంలోని చాలామంది కెరీర్స్ కు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారు చిరంజీవి.

ఇప్పుడు చిరంజీవిలో కొత్త కోణాన్ని బయటపెట్టాడు హీరో వరుణ్ తేజ్. తమ కుటుంబంలో ది బెస్ట్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి మాత్రమే అంటున్నాడు ఈ హీరో. మరీ ముఖ్యంగా తన సినిమాల వరకు చిరంజీవి ఎనాలసిస్ సూపర్ అనేది ఇతడి మాట.

“మా ఫ్యామిలీలో బెస్ట్ క్రిటిక్ పెదనాన్న చిరంజీవి గారే. ఆయనకు సమయం, సందర్భం బాగా తెలుసు. రిలీజైన వెంటనే పిలిచి వాయించేయరు. సరైన టైమ్ లో పిలిచి నా సినిమాలపై అప్పుడప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తారు. నాకే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ బెస్ట్ క్రిటిక్ ఆయనే.”

‘మట్కా’ సినిమాలో చాలా చోట్ల నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు వరుణ్. దీనిపై స్పందించిన ఈ హీరో.. నెగెటివ్ షేడ్స్ లో కనిపించినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నాడు. “వాసు అనే పాత్రను మెచ్చుకుంటారు కొందరు, మరికొందరు బాగా తిట్టుకుంటారు, కానీ అతడితో ట్రావెల్ చేస్తారు. మాకు కావాల్సింది అదే.” అంటూ స్పందించాడు. 14న థియేటర్లలోకి వస్తోంది ‘మట్కా’.

Recent Posts

అఖిల్ పెళ్లి… బాబుకి ఆహ్వానం

తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ప్రముఖలను నాగార్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్… Read More

June 3, 2025

దీపికకే మణి సపోర్ట్… కానీ…

మణిరత్నం వంటి మహాదర్శకుడు కూడా హీరోయిన్ దీపిక పదుకోన్ కే మద్దతు ప్రకటించారు. షూటింగ్ టైం తక్కువ ఉండేలా చూడమని… Read More

June 3, 2025

డిసెంబర్ స్లాట్ నిండిపోతోంది

డిసెంబర్ నెల కూడా తెలుగుసినిమాకి కీలకమైన సీజన్ గా మారింది. ఇటీవల పుష్ప 2, అఖండ వంటి సినిమాలు డిసెంబర్… Read More

June 3, 2025

మేం ఆటబొమ్మలం కాదు

నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More

June 2, 2025

ఈనెల వారానికో క్రేజీ మూవీ!

మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More

June 2, 2025

ఇంత ఓవరాక్షన్ అవసరమా?

సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More

June 1, 2025