ఎన్టీఆర్ ప్రస్తుతం “వార్ 2” సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇది మొదటి బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజులపాటు ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనాలి.
తాజాగా హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఎన్టీఆర్ తో ఒక సెల్ఫీ దిగింది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దాంతో ఎన్టీఆర్ లుక్ రివీల్ అయింది. ఎన్టీఆర్ ఈ ఫొటోలో చాలా స్టయిలిష్ గా ఉన్నారనే చెప్పాలి (అఫ్కోర్స్ ఆ భామ ఫిల్టర్ వాడింది అనుకోండి).
ఐతే, ఎన్టీఆర్ “వార్ 2″లో ఎలా ఉంటాడు అనే దానికి సమాధానం దొరికింది. ఆయన లుక్ ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్ జిమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు అదే జిమ్ కి వచ్చిన ఊర్వశి ఇలా సెల్ఫీ తీసుకొంది.
ఊర్వశి తెలుగులో ప్రస్తుతం బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఎన్టీఆర్ “వార్ 2” సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో కియారా అద్వానీ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఆమె ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More