పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే తిరుమల కొండ మెట్లెక్కి మొక్కు తీర్చుకుంటానని సాయిధరమ్ తేజ్ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాడు. దేవుడు కరుణించాడు, పవన్ ఎమ్మెల్యే అయ్యారు. దీంతో సాయితేజ్ తన మొక్కు చెల్లించుకున్నాడు. తిరుమల మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నాడు.
సరిగ్గా ఇలాంటి మొక్కే త్రివిక్రమ్ కూడా చేసినట్లు ఉన్నారు.
ఈ రోజు ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. నడకమార్గంలో మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్న త్రివిక్రమ్, బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొన్నారు. పవన్ గెలవాలని త్రివిక్రమ్ కూడా మొక్కుకున్నట్టున్నారని అంటున్నారు.
త్రివిక్రమ్-పవన్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఒక దశలో పవన్ కు అన్నీ తానై వ్యవహరించారు త్రివిక్రమ్. పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పుడు ఆయనకు సినిమాలు సెట్ చేసి పెట్టింది కూడా త్రివిక్రమే.
అలా తెరవెనక తనకు కుడి భుజంలా ఉన్నాడని స్వయంగా పవన్ కల్యాణ్, ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు పవన్ తో, త్రివిక్రమ్ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు. అందుకే పవన్ కల్యాణ్ గెలుపు కోసం త్రివిక్రమ్ మొక్కుకొని ఉంటారు. ఈరోజు చెల్లించుకున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More